టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి.. భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించనున్నాడు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా (డిసెంబర్ 15, ఆదివారం) ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read : Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ
మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా బినేంద్ర మీనన్, ఎడిటింగ్ బాధ్యతలను సతీష్ సూర్య చేపడుతున్నారు. కథ కనుక చూసుకుంటే భర్త–భార్యల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా సున్నితంగా చూపించనుంది. ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి కూడా పూర్తి స్థానం ఉండబోతుంది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మొత్తానికి ‘సతీ లీలావతి’ ద్వారా లావణ్య మరోసారి ఒక డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.