Rashmika-Vijay Wedding: వరుస చిత్రాలతో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజు ట్రెండింగ్‌లో నిలిచింది రష్మిక మందన్న. అయితే, తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌లో చిట్‌చాట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఆన్సర్స్ చెప్పింది. ఇక, తన భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటుందో చెప్పాలని ఒక ఫ్యాన్ కోరగా మందన్న నవ్వుతూ దానికి సమాధానం ఇచ్చింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి.. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే వ్యక్తి కోసం చూస్తున్నా.. అలాగే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన్న వెల్లడించింది.
Read Also: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!
ఇక, అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను.. ఆ యుద్ధంలో బుల్లెట్ కైనా ఎదురెళ్తానని నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్కొనింది. ఇక, అక్టోబర్ 3వ తేదీన రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం జరిగినట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో ఆమె పరోక్షంగానే స్పందించారు. అలాగే, నా ఎంగేజ్మెంట్ విషయంలో మీరు ఏం అనుకుంటున్నారోఅదే నిజం.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఇక, ఒకవేళ మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? అని మరో అభిమాని ప్రశ్నించగా.. డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను.. ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం.. అలాగే, పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటకి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్యులేషన్స్ చెప్పగా.. రష్మిక మందన్న థాంక్స్ చెప్పింది.