కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో “గుడ్‌బై” చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు.…