బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్, సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ‘ఆజాద్’ అనే మూవీతో గత ఏడాది బీటౌన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆల్ట్రా డిజాస్టర్ అయినా.. ‘వూయమ్మ’ సాంగ్‌తో యూత్ గుండెల్లో క్రష్ బ్యూటీగా మారింది రవీనా ముద్దుల తనయ రాషా. కూతురు బీటౌన్ ఎంట్రీ సరిగ్గా లేదని టాలీవుడ్‌లో ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసింది రవీనా. తనకు బాలయ్యలా, తన కూతురికి మోక్షజ్ఞ ఫర్‌ఫెక్ట్ చాయిస్ అనుకుంది. కానీ మోక్షు- ప్రశాంత్ వర్మ మూవీ ఏమైందో తెలియదు.
Also Read: Anasuya Bharadwaj: ప్రెస్ మీట్‌లో అనసూయ కన్నీళ్లు.. నేను బాగానే ఉన్నా, లేకపోయినా..!
నందమూరి వారసుడు కాకపోతే ఏం.. ఘట్టమనేని వారసుడుతో కూతుర్ని లాంచ్ చేయబోతుంది రవీనా టాండన్. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’లో లెజెండరీ యాక్టర్ కృష్ణ పెద్దబ్బాయి రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇందులో రాషా తడానీ హీరోయిన్. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆజాద్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్‌కు హాయ్ చెప్పని రాషా.. లైకీ లైకా అనే ఫిల్మ్ చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్‌లో రాబోతుంది. అలాగే సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో ఓ మూవీకి ప్లాన్ చేస్తుందని టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.