టాలీవుడ్‌లో మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథా నేపథ్యం తిరుపతి పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు స్వయంభుగా వెలసిన తిరుమల…