Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. దీంతో ఈ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది? చరిత్రలోని ఏ సంఘటనను తెరపై ఆవిష్కరించబోతున్నారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘శ్యామ్ సింగ రాయ్’తో తనదైన మేకింగ్‌ను చూపించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ .. ‘రణబాలి’తో మరింత భారీ కాన్వాస్‌ను ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ కోసం యానిక్ బెన్, ఆండీ లాంగ్ న్గుయెన్ వంటి అంతర్జాతీయ స్టంట్ నిపుణులు భాగమయ్యారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ‘రణబాలి’ అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియడంతో ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
The darkest chapter of our history opens this October.#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26🔥#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop #JishnuBhattacharjee #ShivamRao… pic.twitter.com/7Na5zev7Pe
— Mythri Movie Makers (@MythriOfficial) August 27, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!