Tilak Varma: పాకిస్థాన్‌పై ఓటమికి కారణం అదే.. నేను ఏం చేయలేకపోయా.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma on India A’s Loss to Pakistan: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ఖతార్‌లోని దోహాలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పాకిస్థాన్ ‘ఏ’ 48 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 265 పరుగులకే పరిమితమైంది. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన హసన్ నవాజ్ (82 బంతుల్లో 79 పరుగులు)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఓటమి అనంతరం భారత్ ‘ఏ’ కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందించాడు.
అభిషేక్ శర్మ ఆరంభంలో చక్కగా ఆడాడని, ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ తనతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని తిలక్ వర్మ తెలిపాడు. మ్యాచ్‌ను వేగవంతం చేయాల్సిన సమయంలో షాబాజ్ వికెట్ కోల్పోవడం తమని దెబ్బతీసిందని చెప్పాడు. అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే తాను మ్యాచ్‌ను ముగించగలిగేవాడినని అభిప్రాయపడ్డాడు. ‘అభిషేక్ ఆరంభం నుంచి బాగా ఆడాడు. ఆ తర్వాత షహబాజ్ నాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మేము వేగం పెంచాలనుకున్న సమయంలో దురదృష్టవశాత్తూ షహబాజ్ ఔటయ్యాడు. ఆపై నేను ఏం చేయలేకపోయా. ఒకవేళ అతను మరో రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఉంటే.. నేను మ్యాచ్‌ను ముగించగలిగేవాడినేమో’ అని తిలక్ చెప్పాడు.
Also Read
- India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
- Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
- Ind Vs Pak: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. బౌండరీ ఆపే క్రమంలో వైభవ్‌కు గాయం..
- Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్‌ను మలుపుతిప్పారు’
రెండో ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా తొలి పది ఓవర్లలో బంతి కొంత స్వింగ్ అయింది. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన పాక్ ఫాస్ట్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. అదే సమయంలో మేము మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అలా జరగకపోయి ఉంటే 47వ లేదా 48వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించేవాళ్లం. నేను అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. నా దృష్టిలో మ్యాచ్ గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. మ్యాచ్ గెలవకపోతే, నేను సెంచరీ చేసినా ఉపయోగం ఉండదు. నా సెంచరీ అత్యుత్తమ ప్రదర్శన కానే కాదు. క్రీజులో నిలబడి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈరోజు కూడా అదే ప్రయత్నం చేశాను. మరో బ్యాటర్ ఎవరైనా నాకు సహకారం అందించి ఉంటే మ్యాచ్‌ను ముగించగలిగేవాడిని’ అని తిలక్ తెలిపాడు.
కెప్టెన్‌గా జట్టుపై బాధ్యత తీసుకోవడం తనకు ఇష్టమని తిలక్ వర్మ చెప్పాడు. జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ బాధ్యతను స్వీకరించి, మ్యాచ్‌ను గెలిపించేందుకు చివరి వరకు పోరాడాలని భావిస్తానన్నాడు. దేవుడి దయ వల్ల తనకు పరుగులు వచ్చాయని, అయితే వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం సాధించడమే తనకు ముఖ్యమని తిలక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ 149 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 100 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ (70), షాబాజ్ (56) పోరాడారు.
తాజావార్తలు
-
Tilak Varma: పాకిస్థాన్‌పై ఓటమికి కారణం అదే.. నేను ఏం చేయలేకపోయా.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!