Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో రామాయణ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ కు ముందు రామాయణ చాలా కష్టాలు ఫేస్ చేసింది. సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఏది వచ్చినా ట్రోలింగ్ కావాల్సిందే. ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి సీతగా సెట్ కాలేదంటూ కామెంట్స్ చేశారు. ప్రీ బుకింగ్ సేల్స్ కూడా అంతంత మాత్రమే. రెండు పార్ట్ లకు 4000 కోట్లు ఖర్చయిందని నిర్మాతలు ప్రకటించారు. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ ఎంతో కొంత తీసుకొచ్చినా, బడ్జెట్ పెరిగిపోవడంతో ఇవేవీ సరిపోలేదు. ఇక రామాయణ ఆశలన్నీ థియేట్రికల్ కలెక్షన్స్ పైనే. రామాయణ ఫస్ట్ పార్ట్ థియేట్రికల్ రైట్స్ ను వరల్డ్ వైడ్ 800 కోట్లకు అమ్మారు. ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇది. ఇంతవరకు 1000 కోట్ల మార్కు దాటిన 10 సినిమాల్లో ఒక్క సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు దాటలేదు. దీంతో ఇవి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు తీసుకొచ్చాయి. రామాయణ ముందున్న టార్గెట్ 800 కోట్లు అయితే, ఇప్పటివరకు 500 కోట్ల షేర్, 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రామాయణ బ్రేక్ ఈవెన్ కావాలంటే 800 కోట్ల షేర్, 1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగితే ఇంకో వారం, 10 రోజుల్లో పెట్టుబడిని రాబట్టే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ అయినా బిజినెస్ ఎక్కువగా జరగడంతో రామాయణ భారీ లాభాలు చూడలేదు.
ఒకప్పుడు 100 కోట్లు దాటితే అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేవారు. రాను రాను ఈ టార్గెట్ 1000 కోట్లకు చేరుకుంది. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను గొప్పగా చెప్పుకుంటున్నారు. రామాయణకు ముందు ఈ ఘనత సాధించిన ఆ 10 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. బాహుబలి 2 తో పోల్చుకుంటే దంగల్ ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా, చైనాలో 1200 కోట్లు రాబట్టి ఓవరాల్ గా 2070 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది. దంగల్ తర్వాత 1813 కోట్లతో ధురంధర్ 2 టాప్ సెకండ్ ప్లేస్ ను కైవసం చేసుకుంది.
Also Read
- Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
- Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
- Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
ధురంధర్ హిట్ తర్వాత ధురంధర్ 2 భారీ అంచనాలతో రిలీజ్ అయింది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ రావడంతో 1800 కోట్లు దాటింది. 1307 కోట్లతో ధురంధర్ ఐదో ప్లేస్ లో ఉంది. ఇండియన్ మూవీస్ లో తొలి 1000 కోట్ల సినిమాగా బాహుబలి 2 నిలిచింది. 1788 కోట్లతో బాహుబలి 2 థర్డ్ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1742 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ 1230 కోట్లు, కేజీఎఫ్ 2 1215 కోట్లతో 6, 7 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 1160 కోట్లు రాబట్టిన జవాన్, 1055 కోట్లతో పఠాన్, 1042 కోట్లతో కల్కి ఉన్నాయి. రామాయణ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో ట్రేడ్ పండిట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ తెలుగులో రోజుకి 3 కోట్ల షేర్, 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తున్న రామాయణ ఇంకో నాలుగైదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. తెలుగు రైట్స్ ను 41 కోట్లకు దిల్ రాజు తీసుకుంటే, ఇప్పటివరకు 29 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ రోజుకి 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తోంది. ఈ లెక్కన ఇంకో వారం, 10 రోజుల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
-
Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
-
Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!