Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meesho: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం మీషో (Meesho) ఇన్వెస్టర్లకు సోమవారం (నవంబర్ 16) అత్యంత కీలకం కానుంది. వారం ప్రారంభం రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీషో షేర్లలో భారీ కదలికలు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ స్టాక్‌లో జరిగిన ఒక మెగా బ్లాక్ డీల్. మీషో ప్రారంభ ఇన్వెస్టర్లలో ఒకటైన జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఓపెన్ మార్కెట్లో కోట్లాది షేర్లను విక్రయించగా.. వాటిని కొనేందుకు దేశ, విదేశీ దిగ్గజ సంస్థలు పోటీపడ్డాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్లాక్ డీల్ డేటా ప్రకారం.. సాఫ్ట్‌బ్యాంక్ తన అనుబంధ సంస్థ ‘SVF II మీర్కట్ (DE) LLC’ ద్వారా మీషోలో ఉన్న తన 1.65 శాతం వాటాను విక్రయించింది. ఈ మొత్తం లావాదేవీ విలువ ఏకంగా రూ.1,885.17 కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరును సగటున రూ. 246.75 ధరకు చొప్పున సాఫ్ట్‌బ్యాంక్ మొత్తం 7.64 కోట్ల షేర్లను అమ్మేసింది. ఈ భారీ విక్రయంతో మీషోలో సాఫ్ట్‌బ్యాంక్ (SVF II మీర్కట్) వాటా 6.84 శాతం నుంచి 5.19 శాతానికి తగ్గింది. ప్రస్తుతం బీఎస్ఈలో మీషో షేరు ధర రూ. 257.15 వద్ద ముగియగా, మార్కెట్ ధర కంటే కాస్త తక్కువకు ఈ డీల్ జరగడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read
- EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
- Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..
ఒకవైపు సాఫ్ట్‌బ్యాంక్ వాటాను తగ్గించుకోగా, మరోవైపు ఆ షేర్లను దక్కించుకోవడానికి గ్లోబల్ ఫండ్స్ ఎగబడ్డాయి. ఈ బ్లాక్ డీల్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం ‘సొసైటీ జనరల్’ అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. ఈ సంస్థ ఒక్కటే రూ. 364.65 కోట్లు వెచ్చించి 1.47 కోట్లకు పైగా షేర్లను సొంతం చేసుకుంది. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అయిన హెచ్డీఎఫ్సీ, మోతీలాల్ ఓస్వాల్, ఎడెల్వైస్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్‌తో పాటు బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీషో షేర్లను కొనుగోలు చేశాయి. విదేశీ దిగ్గజాల్లో మార్గన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, బీఎన్పీ పారిబాస్, విలియం బ్లెయిర్ వంటి సంస్థలు ఈ డీల్‌లో పాలుపంచుకున్నాయి. వీటన్నింటికీ మించి సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, నార్వే ప్రభుత్వ వెల్త్ ఫండ్ ‘గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్’ సైతం మీషోలో పెట్టుబడులు పెట్టడం విశేషం.
2025 డిసెంబర్లో రూ.5,421.20 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి వచ్చిన మీషో, ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే అందిస్తోంది. 2026లో ఇప్పటి వరకు ఈ షేరు 40 శాతానికి పైగా పెరగ్గా, గత మూడు నెలల్లోనే 30 శాతం లాభపడింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాల పరంగానూ మీషో వేగంగా పుంజుకుంటోంది. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో కంపెనీ తన నికర నష్టాలను ఏకంగా 68 శాతం తగ్గించుకుని రూ. 132.44 కోట్లకు పరిమితం చేసింది (గతేడాది ఇదే కాలంలో నష్టం రూ. 411.3 కోట్లుగా ఉండేది). ఇదే సమయంలో ఆదాయం 34.4 శాతం వృద్ధి చెంది రూ. 4,131.58 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత.. సాఫ్ట్‌బ్యాంక్ వాటా విక్రయంపై ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారు, విదేశీ దిగ్గజ ఫండ్స్ కొనుగోళ్ల నేపథ్యంలో షేరు మరింత పుంజుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!