Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఓ పాత ఫొటో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దృశ్యానికి, నేటి వాస్తవ రూపానికి మధ్య జరిగిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 2019 జూలైలో ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చేసిన ఒక ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా ముగ్గురూ కలిసి 3 భాగాల 3D విజువల్ వండర్‌గా ‘రామాయణ’ను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీతో పాటు ‘మామ్’ చిత్ర దర్శకుడు రవి ఉద్యావర్ సంయుక్తంగా ఈ త్రయాన్ని తెరకెక్కిస్తారని ప్రకటించి, ఐదుగురూ కలిసి దిగిన ఫొటోను విడుదల చేశారు.
ఆ ఫొటోలో ఉన్న ఐదుగురిలో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్నది కేవలం ఇద్దరే. నితీష్ తివారీతో సమానంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నడిపించాల్సిన దర్శకుడు రవి ఉద్యావర్ ఏ క్షణంలో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించారో ఎవరికీ అంతుచిక్కలేదు. ఆయన పేరు వివాదాలు లేకుండానే తెరవెనుక సైలెంట్‌గా మాయమైపోయింది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన పిల్లర్లుగా నిలబడతారనుకున్న అల్లు అరవింద్, మధు మంతెనలు అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ బడ్జెట్, క్రియేటివ్ విభేదాలు, చివరకు ఐపీ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) హక్కుల చెల్లింపుల వివాదం వరకు వెళ్లడంతో మధు మంతెన బహిరంగ నోటీసులు ఇచ్చే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. భాగస్వాములందరినీ పక్కకు నెట్టి, హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ కంపెనీ డీనెగ్ (DNEG) అధినేత నమిత్ మల్హోత్రా మొత్తం పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. తర్వాతి రోజుల్లో కన్నడ స్టార్ యశ్ (మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్) సహ నిర్మాతగా చేరి రావణుడి పాత్రకు ఎంపికయ్యారు. తెలుగు సినిమాకు గర్వకారణంగా అల్లు అరవింద్ చేతుల మీదుగా మొదలైన ఈ మెగా డ్రీమ్ ప్రాజెక్ట్, చివరకు పూర్తిగా ముంబై-గ్లోబల్ కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి వెళ్లిపోవడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాడు ఐదుగురి కలగా మొదలైన పయనం, నేడు ఎన్ని వివాదాలు, మలుపులు దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిందో గుర్తుచేస్తూ ఈ పాత చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
-
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!