Ram Pothineni : ఈసారి మాస్ కాదు, క్లాస్ ఫీలింగ్‌తో సినిమా చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Thiruveer : ‘సలార్’ లో విలన్ ఛాన్స్ మిస్ అయ్యా..
Also Read
- D56 : నాగవంశీ - ధనుష్ - తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
- The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
రామ్ మాట్లాడుతూ.. “ఇటీవల చాలా సినిమాలు హింసాత్మకంగా మారిపోయాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి కొంత పాజిటివ్ ఫీలింగ్ తీసుకెళ్లే సినిమాలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి. అందుకే ఈసారి సౌమ్యమైన, భావోద్వేగాలతో నిండిన కథను ఎంచుకున్నాను. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అలాంటి హృదయానికి హత్తుకునే కథ. ఇందులో నేను చేసే పాత్ర ప్రేక్షకులందరికీ దగ్గరగా అనిపిస్తుంది,” అని తెలిపారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇదని రామ్ పేర్కొన్నాడు. ఇక సినిమాపై బజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, అభిమానులు కూడా రామ్ ఎలాంటి న్యూ అవతార్‌లో కనిపించబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!