రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడూ న్యూస్ లో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. దర్శకుడుగా మనుపటి ఫామ్ కోల్పోయాడు వర్మ. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదన తప్ప వేరే ఏమీ ఆలోచించటం లేదు వర్మ. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కోరుకుంటుంటాడు. కరోనా టైమ్ లోనూ సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడ వర్మకే చెల్లింది. గతేడాది కరోనా వచ్చినపుడు సొంతంగా ఎటిటి (ఎనీ టైమ్ థియేటర్) పెట్టి పే ఫర్ వ్యూ మోడల్ లో తక్కువ నిడివి ఉన్న సినిమాలు రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. అలా వచ్చినవే ‘పవర్ స్టార్, క్లైమాక్స్, నేకెడ్, కరోనా వైరస్’ మొదలైనవి. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో వేరే వ్యాపార వేత్తతో కలసి ఓటీటీ ప్లాట్ ఫామ్ స్పార్క్ ను ఆరంభించాడు. మే 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దీని గురించి తన శిష్యగణంతో పాటు స్టార్స్ ని ఇన్ వాల్వ్ చేసి ప్రచారం చేయిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫామ్ కి కావలసిన కంటెంట్ ఉందో లేదో కానీ ప్రమోషన్ మాత్రం గట్టిగానే చేస్తున్నాడు. మరి వర్మ ఈ ఓటీటీతోనైనా స్థిరంగా స్థిర పడతాడా? లేక కొత్తదనం అంటూ వేరే దాని వెంట పడతాడా అన్నది తేలాల్సి ఉంది.