గతంలో వ్యూహం అనే సినిమా చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ కోసం కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. వరుసగా ఆయన మీద ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లారు. అయితే వర్మ ఇప్పుడు వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఎన్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెట్టిన మార్ఫింగ్ ఫోటోల ట్వీట్ల గురించి ప్రశ్నిస్తే నేను రోజుకి 10 -15 ట్వీట్లు పెడుతూ ఉంటాను. కొన్ని వేల ట్వీట్లు పెట్టి ఉంటాను ఆ జరిగిన విషయాలు ఏవో నాకు ఇప్పటికీ గుర్తులేదు, నాకు ఎక్కడ గుర్తుంటాయి.
Mufasa The Lion King: ఒకే ఫ్రేములో రెండు సింహాలు!!
వేల వేల ట్వీట్లు పెట్టి ఉంటాను. ఆ టైంలో కొన్ని వేల ట్వీట్లు పెట్టాను, అది నాకు గుర్తులేదు. కానీ అది చూసిన తర్వాత కూడా నాకు గుర్తు రాలేదు. అలాంటి ట్వీట్లే అందరూ పెడతారు పెట్టని వాళ్ళు లేరు. అలాంటప్పుడు మీరు వీళ్ళ మీద కేసు పెడదాం వాళ్ళ మీద కేసు పెట్ట వద్దు అని ఎలా మీరు డిసైడ్ అవుతున్నారు. అలాంటప్పుడు అందరూ అందరి మీద కేసులు పెడితే వాటిని సాల్వ్ చేసేది ఎవరు అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కేసులు పెడతానంటే, జైలు సరిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కొన్ని వందల ట్వీట్లు, వేల లక్షల ట్వీట్లు వస్తున్నప్పుడు వాటిని మానిటర్ చేయడం కుదరదనీ అన్నారు. వాటిని మానిటర్ చేసేందుకు పోలీస్ సిస్టం పెడితే అది పెద్ద అవినీతి సిస్టంగా మారుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.