మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. డిసెంబరు 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్.
Also Read : Jr NTR : ఏపీ – తెలంగాణ దేవర 11 రోజుల కలెక్షన్స్.. మాస్ మూలవిరాట్
కాగా దసరా కానుకగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేస్తారని ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. తాజగా గేమ్ ఛేంజర్ సంగీత దర్శకుడు తమన్ ‘X’ ఖాతాలో ” దసరా కి టీజర్ రాలేదు అన్నీ డిజప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు, వర్క్ ఫైనలైజింగ్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది, సినిమా & డబ్బింగ్ యొక్క Cg VFX షాట్స్ చివరి ఎడిటింగ్ BGM స్కోర్ ఇప్పటికే ప్రారంభమైంది, మరియు మేము ప్రతి నెలా విడుదలయ్యే అన్ని పాటల కోసం లిరికల్ వీడియో వర్క్‌లను పూర్తి చేస్తున్నాము. ఈ అక్టోబర్ 30 న అనుకున్న సమయానికి సాంగ్ రిలీజ్ చేస్తాం. ఆ విషయంలో నో డౌట్. డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ 2024 గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది. ఇటీవల విడుదలైన రా మచ్చ మచ్చ లిరికల్ సాంగ్ త్వరలో 100 మిలియన్లను చేరుకుంటుంది” అని ట్వీట్ చేసాడు తమన్.
Suppose Dussehra Ki Teaser Rallaedhu Anni disappoint Avvakandi .. guys !! 🫶
Team is on Full Work finalising
Cg VFX Shots final editing of the film & Dubbing
BGM score started already .. and we are getting Lyrical video works done for all the songs which is goona be released…— thaman S (@MusicThaman) October 8, 2024