తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటల మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత శంకర్ కానీ రామ్ చరణ్ కానీ తమకు ఫోన్ చేసిన పాపాన పోలేదు అంటూ శిరీష్ కామెంట్ చేశాడు. అప్పటినుంచి శిరీష్ మీద మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ పేరుతో ఒక లేఖను రిలీజ్ చేసి ఇది గమనిక కాదు చివరి హెచ్చరిక అంటూ 6 పాయింట్లను మెన్షన్ చేయడం గమనార్హం. ఆ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకొనే మీరు, ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికి అపాదించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Also Read:Ram Charan: దిల్ రాజు అలా.. శిరీష్ ఇలా.. అసలేంటీ మ్యాటర్?
1. 1 నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ, హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?
2. మైత్రీ బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?
3. సైంధవ్ ఫెయిల్ అయ్యాక, ఆ నిర్మాత, వెంకటేశ్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ?
4. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా ? ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా ?
5. “దర్శకుడు శంకర్ ఉన్నాడు” అని వెళ్లింది ఎవరు? “ఒక సంవత్సరం” అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు?
6. RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా?
Also Read:Mrunal Thakur: మృణాల్’ను ఇంకా దాస్తారట!
మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి, అది కూడా ఫ్లాప్ అయ్యింది అని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజూ ఇదే విషయం మీద మాట్లాడుతూ, హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురిచేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గానీ, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుగా మాట్లాడితే, ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబడ్డార్!! ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అంటూ లేఖ రిలీజ్ చేశారు.