ఇప్పుడు దిల్ రాజు, శిరీష్ బ్రదర్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. నిజానికి ఈ దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ సహనిర్మాతగా వ్యవహరించిన తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అన్నా తమ్ముళ్లు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విషయం గురించి మాట్లాడే కంటే పాత విషయాల గురించి మాట్లాడడానికి ఇంటర్వ్యూలలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంపౌండ్ నుంచి చివరిగా వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన గేమ్ చేంజర్ గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు వీరిద్దరికీ వస్తున్నాయి.
Also Read:Mrunal Thakur: మృణాల్’ను ఇంకా దాస్తారట!
నిజానికి దిల్ రాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ శిరీష్ మాత్రం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలతో ఎంత కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, ఒకే ఒక్క ఇంటర్వ్యూతో శిరీష్ ఆ అంతటినీ కూల్చేశారనే చెప్పాలి. నిజానికి దిల్ రాజు మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు చాలా సపోర్ట్ చేశాడని, సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం రామ్ చరణ్ అని చెప్పుకొచ్చారు. ఆయనే లేకుంటే ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయనకు ఒక డిజాస్టర్ ఇచ్చిన రిగ్రెట్ తనకు ఉందని, ఆయనతో మరో సినిమా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తాజాగా వెల్లడించారు.
Also Read:Dhanush: హోంపిచ్ పై కన్నేసిన ధనుష్ ?
కానీ శిరీష్ మాత్రం తాము ఇబ్బంది పడుతున్నప్పుడు రామ్ చరణ్ కానీ శంకర్ గానీ కాల్ చేయలేదని, కనీసం కాల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో శిరీష్ ను మెగా అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. శిరీష్ మాటలు కరెక్ట్ కాదని, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ వేరే సినిమాల జోలికి వెళ్లకుండా మీకు మాట ఇచ్చాడనే కారణంగా గేమ్ చేంజర్ పూర్తి చేస్తే, ఇప్పుడు ఆయన మీద అభాండాలు వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. నిజానికి శిరీష్ అన్న మాటల్లో తప్పేమీ లేదు. ఎందుకంటే అలాంటి భారీ డిజాస్టర్ చూసిన తర్వాత డైరెక్టర్ లేదా హీరో నుంచి కనీసం కాల్ ఎదురు చూస్తారు. వారు కనక చేసి మాట్లాడి ఉంటే బాగుండేది. అయితే అప్పటికే అలాంటి డిజాస్టర్‌తో ఇబ్బంది పడుతున్న రామ్ చరణ్‌కు నిర్మాతలే కాల్ చేసి ఉంటే బాగుండేది కదా అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద దిల్ రాజు కామెంట్స్ ఒకలా ఉంటే, శిరీష్ కామెంట్స్ దానికి భిన్నంగా ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అందరూ శిరీష్‌ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.