Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్‌కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత ‘రోబో’తో 200, 300 కోట్ల మార్కును కూడా పరిచయం చేశాడు. ఇక ‘2.0’ అయితే 400, 500, 600, 700 కోట్లు కలెక్ట్ చేసి ఒకే సినిమాతో నాలుగు రికార్డులు క్రియేట్ చేశాడు.
లేటెస్ట్గా ‘జైలర్ 2’తో 800 కోట్ల క్లబ్‌లోకి కోలీవుడ్‌ను తీసుకువెళ్లాడు సూపర్ స్టార్. సినిమా లాంగ్ రన్లో 850 నుంచి 900 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ రోజుకు 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తోంది. హిందీలో 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో 1000 కోట్ల మార్క్ చేరలేకపోయింది. బాలీవుడ్లో 200 కోట్లు కలెక్ట్ చేసి ఉంటే ఇప్పటికే 1000 కోట్ల మార్క్ దాటేది. ‘జైలర్ 2’ తమిళంలో 800 కోట్ల రికార్డునే కాదు, కేరళలో ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్న 74 కోట్ల రికార్డును కూడా బ్రేక్ చేసింది. అలాగే కర్ణాటకలోనూ టాప్ తమిళ్ మూవీగా నిలిచింది. తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా రికార్డు ‘లియో’ పేరు మీద ఉంది. ‘లియో’ 230 కోట్ల రికార్డుకు ‘జైలర్ 2’ చేరువవుతోంది. ఇప్పటికే తమిళంలో 210 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read
- Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
- Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న 'ఈ నగరానికి ఏమైంది' కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
- Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
‘జైలర్ 2’ 1000 కోట్ల కల తీరుస్తుందని తంబీలు ఆశపడ్డారు. తెలుగు నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘పుష్ప 2’, ‘కల్కి’ వరల్డ్ వైడ్ 1000 కోట్లు రాబట్టాయి. కన్నడ నుంచి ‘కేజీఎఫ్ 2’ ఆ ఫీట్ అందుకుంది. ఇంతవరకు తమిళంలో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమానే లేదు. ఆ లోటును ‘జైలర్ 2’ తీరుస్తుంది అనుకుంటే మాక్సిమం 900 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!