Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radha Krishna: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలం పాటుసినీ వేడుకలకు, మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఒక సినీ వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘డోంట్ స్లీప్’ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి రాధాకృష్ణ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన ఆయనను యాంకర్ సాదరంగా ఆహ్వానించగా, చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేదికపై దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు శ్యామ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “డోంట్ స్లీప్ చిత్ర బృందానికి ముందుగా నా శుభాకాంక్షలు. శ్యామ్ భాయ్ నాకు దాదాపు 22 ఏళ్లుగా తెలుసు. ఆయన నాకు కేవలం మంచి స్నేహితుడే కాదు, నా మెంటార్, సోదరుడిలాంటి వ్యక్తి. మేము ఏం చేసినా, ఎలా చేసినా ప్రతిసారీ కలిసి చర్చించుకునేవాళ్లం. ఆయన ఎప్పుడూ కొత్త టెక్నిక్స్, సినిమా మేకింగ్‌లో సరికొత్త పద్ధతులను ఆలోచిస్తుంటారు.”
Also Read
ఈ సినిమాను ఆయన ఎలా తెరకెక్కించారో నాకు చెప్పినప్పుడు నిజంగానే చాలా ఆశ్చర్యపోయాను. తక్కువ బడ్జెట్లో, ఎంతో వేగంగా సినిమాలను ఎలా రూపొందించవచ్చో మనమందరం ఇలాంటి ప్రయత్నాల నుంచి నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. చిత్ర హీరో, హీరోయిన్లతో పాటు యూనిట్ మొత్తానికి మంచి విజయం దక్కాలని, వారి జర్నీ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత మీడియా కంటపడిన రాధాకృష్ణ మాటలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..