Pushpa 2 : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న పుష్ప -2..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడితో ఇండియన్ నెంబర్ 1 మూవీ ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది.
Also Read : DaakuMaharaaj : బాలయ్య తో మరో సినిమా చేస్తా : బాబీ కొల్లి
Also Read
అయితే ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లో చూసేసినప్పటికీ, రీసెంట్గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. సుకుమార్ యాడ్ చేసిన సీన్స్ మాత్రం సినిమాకే హైలెట్‌గా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ అభిమానులు. థియేటర్లో సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడా ఆ సమయం వచ్చేసిందని చెప్పాలి. జనవరి 29న లేదా 31న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. మరి ఓటిటిలో పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా 3 గంటల 40 నిమిషాల ఫుల్ రన్ టైంతో ఓటీటీలోకి రానుంది.
తాజావార్తలు
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!