Site icon NTV Telugu

Naga Vamsi : ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి రవితేజ సినిమా వాయిదా !

Naga Vamsi

Naga Vamsi

జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ రిజల్ట్ కారణంగానే ‘మాస్ జాతర’ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నాగ వంశీ. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ నిజానికి సినిమా వర్క్ ఆలస్యంగా నడిచింది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేయాలని ఒక డేట్ అనుకున్నాం, కానీ ఆగస్టు 14వ తేదీ వచ్చిన ‘వార్ 2’ సినిమా కారణంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే నన్ను ఒక రేంజ్ లో ట్విట్టర్లో వేసుకుంటున్నారు. ఆ సమయంలో రవితేజ గారి సినిమా తీసుకురావడం మంచిది కాదనిపించింది.

Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా

ఆల్రెడీ వేసుకుంటున్నప్పుడు మళ్లీ ఇంకో సినిమా దింపితే ఆ ఎఫెక్ట్ దీని మీద కూడా పడుతుంది. అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది రవితేజ గారి కెరీర్ లో 75వ సినిమా అని ఆయన అన్నారు. నిజానికి నేను ఇప్పుడెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూశారు. బయట సినిమాకి దొరికేశాను, వాళ్ళ ఆనందం తీర్చుకున్నారు. ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి ఎదురు వెళ్లడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే రవితేజ గారి సినిమాని వాయిదా వేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ‘మాస్ జాతర’ అనే సినిమా రూపొందింది. భాను భోగ వరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది

Exit mobile version