యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది.
Also Read : Surya : 3భాషలు.. 4అతిధులు.. కంగువా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేఫర్ బిఫోర్..
ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయనే మంచి పాయింట్ తో “కలి” సినిమా రూపొందింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి మ్యూజిక్, ఎంటర్ టైన్ చేసే క్యారెక్టర్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో ఆకట్టుకుంది. ఓటీటీ విభిన్నసినిమాలు, వెబ్ సిరీస్ లు అందిస్తున్న ఈటీవీ విన్ తాజాగా కలి సినిమాను తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు తీసుకు రానుంది. ఈ నెల 17వ తేదీ నుంచి “కలి” ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్స్ లో ఆకట్టుకున్న కలి, ఈటీవీ విన్ లోనూ మరింతగా మూవీ లవర్స్ ఆదరణ పొందనుంది. ఈ చిత్రంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి తదితర సీనియర్ నటీనటులు నటించారు.