తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.
Also Read : Amir Khan : గజనీ సీక్వెల్ లో అమీర్ ఖాన్.. దర్శకుడు ఎవరంటే..?
అటు ఇటుగా నాలుగు వందల కోట్ల రుపాయల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు స్టూడియో గ్రీన్ కే.ఈ జ్ఞానవేల్ రాజా, యువీ వంశీ. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాను నవంబరు 14న వరల్డ్ వైడ్ గ రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. కంగువ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. తెలుగులో నిర్వహించే ఈవెంట్ కు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నాడు. అలాగే తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నట్టు తమిళ వర్గాల సమాచారం.ఇక బాలీవుడ్ లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, బాబీ డియోల్ ఛీఫ్ గెస్టులుగా రానున్నారు. అక్టోబరు 26న ఆడియో లాంఛ్ కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.