బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్‌లను అందించారు. కోల్‌కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయన కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కేకేను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు రాత్రి 10.30లకు కేకే మృతి చెందినట్లు ప్రకటించారు.
కేకే తన ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను అంతకు ముందు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేశాడు. కేకే 200పైగా పాటలను పాడి అందరిని ఆకట్టుకున్నాడు. కేకే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం అమిత్ షా , నటుడు అక్షయ్ కుమార్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటి సోనాల్ చౌహాన్, మున్మన్ దత్తా సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేశారు.