బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘సికందర్’. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించగా. చాలా రోజుల తర్వాత, ఈ మూవీతో సల్మాన్ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే.. ఫ్యాన్స్‌కు డిజాస్టర్ గానే మిగిలిపోయింది. కానీ డిజాస్టార్ టాక్ వచ్చినప్పటికి సల్మాన్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘సికందర్’ సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా వసూలు మాత్రం వచ్చాయి. యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన ఈ సినిమాలో స్టార్ యాక్టర్, టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు.
Also Read: Mukul Dev : ప్రముఖ హిందీ నటుడు ఆకస్మిక మృతి ..
అలాగే సల్మాన్ ఖాన్‌కు ఉన్న భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ సినిమాను భారీ సెట్స్ వేసి, విదేశాల్లో కూడా చిత్రీకరించారు. అలా ఈ సినిమాకు సుమారు 200 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక ఈ ఏడాది ఈద్ కానుకగా థియేటర్స్‌లో వచ్చిన ఈ మూవీ ఫైనల్ గా ఓటిటి రిలీజ్‌కి సిద్ధం అయ్యింది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మే 25 ఆదివారం అంటే రేపటి నుండి స్ట్రీమింగ్‌కి తీసుకొస్తున్నట్టు ఖరారు చేశారు. థియేటర్ లో మిస్ అయిన వారికి.. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.