‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ . బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ మంచి కలెక్షన్‌లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. అయితే హను మాన్ కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో కేవలం హనుమంతుని కథతో మాత్రమే కాకుండా అందులో ఏడుగురు చిరంజీవులైన అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు కూడా కనిపించనున్నారని, ఆ పాత్రల కోసం అన్ని ఇండస్ట్రీల్లోని అగ్ర హీరోలతో ప్రశాంత్ వర్మ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజంట్ వర్మ ‘హనుమాన్ 2’ తో పాటుగా, ‘మహాకాళి’ మూవీ కూడా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
Also Read: Vishnu Priya : నేను అఖిల్‌కు భక్తురాలిని..
ఈ ‘మహాకాళి’ సినిమా బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా, మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్నట్లు చూపించారు. బ్యాగ్రౌండ్ లో మాత్రం గుడిసెలు, జాయింట్ వీల్ మంటల్లో కాలి పోతున్నట్లు చూపించారు. అది చూసి జనాలు భయం తో పరుగెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా ఓ జాతర దగ్గర జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా చేరినట్లుగా కన్ఫర్మ్ అయ్యిందట. ఈ నటుడు రీసెంట్‌గా బాలీవుడ్ భారీ హిట్ చిత్రం ‘ఛావా’ సినిమాలో మెయిన్ విలన్ ఔరంగజేబు పాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఇలాంటి నటుడు ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాలో భాగం కావడం విశేషం. మరి ఈ సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేస్తారో చూడాలి మరి.