ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తున్న విష్ణు .. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కినేని అఖిల్ పై తన ఇంట్రెస్ట్ బయటపెట్టింది.
Also Read: Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
ఇప్పటికే చాలాసార్లు అఖిల్ పై తన ఇష్టాన్ని బయటపెట్టింది విష్ణు ప్రియ. ఏ మాత్రం అవకాశం ఉన్నా అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చింది. మనకు తెలిసి అఖిల్‌కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆ లిస్టులో విష్ణు ప్రియ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. అఖిల్ సినిమా విడుదలైంది అంటే విష్ణు ప్రియ హంగామా మొదలెడుతుంది. ఇక తాజాగా మరోసారి తన ఇష్టాన్ని పంచుకుంది విష్ణు.. ‘అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం వస్తే నా జీవితం ధన్యం అయిపోతుంది. రెమ్యునరేషన్ కూడా వద్దు నాకు అతనితో ఐటమ్ సాంగ్ అయిన ఒకే’ అంటూ చెప్పుకొచ్చింది. అసలు అఖిల్ అంటే ఎందుకు మీకు అంత పిచ్చి అనే మరో ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను పూర్వ జన్మ నుంచే ఆయన భక్తురాలిని అని, ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ అవుతున్న’ అని చెప్పింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.