పోస్ట్ పేండమిక్ విడుదలైన హిందీ చిత్రాలలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐదో వారాంతానికి ఆ సినిమా రూ. 250.73 కోట్ల గ్రాస్ వసూలూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాల నుండి ఎలాంటి పోటీ లేకపోవడంతో లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ మూవీ శుక్రవారం 50 లక్షలు, శనివారం 85 లక్షలు, ఆదివారం 1.15 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రూ. 250 కోట్ల […]
కుల వ్యవస్థ నిర్మూలానికి కంకణం కట్టుకున్న భారత ప్రథమ సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే. ఏప్రిల్ 11 సోమవారం ఆయన 195వ జయంతి సందర్భంగా హిందీలో బయోపిక్ ఒకటి రూపుదిద్దుకోబోతున్నట్టు ప్రకటన వచ్చింది. నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చి ఆ పైన వెబ్ సీరిస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ… జ్యోతిరావ్ పూలే పాత్రను పోషించబోతున్నారు. ‘ఫులే’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బయోపిక్ లో సావిత్రి బాయి పూలేగా జాతీయ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ […]
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ […]