ప్రభాస్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ఒక సినిమా తెరకెక్కుతోంది. దీనికి ఫౌజీ అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. తన సినిమాలలో ఇప్పటివరకు ప్రభాస్ కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆయన రాజా సాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలి. ఫౌజీ కొత్త షెడ్యూల్ త్వరలో తమిళనాడులోని మధురై సమీపంలోని కరైకుడిలో ప్రారంభం కానుంది.
OG : తిరుమలలోనూ పవన్ ఫ్యాన్స్ ఓజీ జపం!!
ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తాడని, దేవిపురం అగ్రహారం నేపథ్యంలో ఒక ముఖ్యమైన కుటుంబ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ప్రభాస్ అందుబాటులోకి రావడంతో ఈ షెడ్యూల్ తేదీలు ఈ వారంలోనే లాక్ కానున్నాయి. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ కలిగి ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథగా చెప్పబడుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.