పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వక ముందు ఈ సినిమా మొదలుపెట్టారు. కొంతమేర షూట్ కూడా జరిగింది కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోవడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందో అనే విషయం మీద క్లారిటీ లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ సినిమా మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే మరో సినిమా తెరకెక్కుతోంది. కానీ ఆ సినిమా కంటే ఎక్కువగా ఓజి సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అభిమానులు.
Sankranthiki Vasthunam: ఆరు రోజుల్లో 100 కోట్ల షేర్
ఎందుకంటే ఇది ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే అవకాశం ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల సైతం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేత చాలా మంది అభిమానులు తిట్లు తిన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా అధికారిక పర్యటనలలో వెళుతున్నప్పుడు కూడా ఈ సినిమా గురించి అరుస్తుంటే ఆయన అవి అరుపులాగా అనిపించడం లేదని బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా నిర్మాత డివీవీ దానయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళితే బయటకు వచ్చాక ఆయనతో సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ అప్పుడు కూడా పవన అభిమానులు ఓజి, ఓజి అంటూ ఓజి జపం చేస్తూ ఉండడం గమనార్హం.