పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజుక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు మన డార్లింగ్. అయితే ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిసిందే.
సందీప్ తన డైరెక్షన్‌లో హీరోలను ఎంత పవర్ ఫుల్‌గా చూయిస్తాడో మనకు తెలిసిందే. ‘యానిమల్’ మూవీ దీనికి పూర్తి నిదర్శనం. దీంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తనదైన మార్క్‌తో పూర్తి పోలీస్ స్టోరీ కథగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. అంతేకాదు ఇప్పటివరకు చూడనివిధంగా ప్రభాస్‌ని ఒక కోణంలో చూపించబోతున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఇన్‌ట్రస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ఎంటంటే ఈ మూవీ తొలి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడట. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో చేయబోతున్నారనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలోని పోలీస్ సీన్స్ కొన్ని ఇక్కడ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తేలినప్పటికీ ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ మాత్రం వెరె లెవల్ ఉంటుందట.