నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్‌లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం క్లాప్ కొట్టడం గౌరవంగా భావిస్తున్నాను” అంటూ ప్రభాస్ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
Read Also : అఫిషియల్ : “బిగ్ బాస్” హోస్ట్ గా ప్రముఖ నిర్మాత
మేకర్స్ అధికారిక టైటిల్‌ను ఖరారు చేసిన తర్వాత ప్రకటిస్తారు. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రం కోసం నాగ్ అశ్విన్ ఒక సంవత్సరానికి పైగా ప్రీ-ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఈ విషయాన్ని కొంచం సస్పెన్స్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.