టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పూజ కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో కనిపించి తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.
ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. కేవలం తమిళ్‌లో మాత్రం పలు క్రేజీ ప్రాజెక్టులను క్యూలో పెట్టింది. ఇప్పటికే స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘రెట్రో’ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్న పూజా, తమిళ స్టార్ హీరో విజయ్ ‘జన నాయగన్’ మూవీలోనూ నటిస్తోంది. అలాగే ఈ రెండు మూవీస్ తో పాటుగా రాఘవ లారెన్స్ హారర్ సిరీస్ మూవీ ‘కాంచన 4’లోనూ పూజా హెగ్డే నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీలో తన పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఏంటి అంటే..
ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటా పాత్ర అంటే.. ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఓ మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలో పూజా నటిస్తుండటంతో ఈ సినిమా పై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.