ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక హీరోయిన్ కెరీర్ ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ.. ఇప్పుడున్న పోటీకి హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అంటే చాలా కష్టం. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది బ్యూటీ పూజా హెగ్డే. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకనోక్క టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్న పూజా ప్రస్తుతం తమిళంలో ‘జన నాయగన్’, ‘కూలీ’, ‘కాంచన 4’ వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు లైన్ లో పెట్టింది. ఇందులో సూర్య తో నటిస్తున్న ‘రెట్రో’ మూవీ మే 1న విడుదల కాబోతుంది. దీంతో మిగతా షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ, ఇటు ‘రెట్రో’ ప్రమోషన్స్‌లో కూడా పాల్గోంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read: HIT 3 : ‘హిట్ 3’ ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్న నాని.!
‘ప్రజంట్ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ ఫాస్ట్‌గా జరుగుతోంది. కానీ, ఆ మాటల్లో భావోద్వేగం ఉండటం లేదు. వాట్సప్ వచ్చిన తర్వాత మనం ఒక ఉత్తరంలో ఉండే ఆనందం కోల్పోయాం. ఒకప్పుడు మనం మనసులోని మాటలు కాగితం మీద ఉంచి, అక్షరాల రూపంలో పంచుకునే వాళ్ళం. ఒక లేఖ రాస్తే, అవతలి వారి నుంచి వచ్చే సమాధానం కొరకు వేయి కళ్ళతో ఎదురు చూసే వాళ్ళం. ఆ అనుభూతికి ఒక ప్రత్యేకత ఉండేది. ఎదురు చూడటం లో ఉండే హ్యాపినెస్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ఫీలింగ్ మిస్ అవుతున్నందుకు నిజంగా ఫీల్ అవుతున్న’ అంటూ చెప్పుకొచ్చింది పూజ.