భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా, ఏకంగా వేసవి 2026కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది, సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం. భారీ బడ్జెట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చని భావిస్తున్నారు.
Also Read :Akhanda 2: ‘అఖండ 2’కు కోర్టులో బిగ్ షాక్: ప్రీమియర్ షోకి ముందు జీవో సస్పెండ్!
రెండో ముఖ్య కారణం… బాక్సాఫీస్ వద్ద ఉన్న తీవ్రమైన పోటీ. ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర్లోనే యష్ ‘టాక్సిక్’, నాని ‘థి ప్యారడైజ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’, మరియు అడివి శేష్ ‘డెకాయిట్’ వంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండడంతో ‘పెద్ది’ కలెక్షన్లు, థియేటర్ల కౌంట్ కూడా ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ భావించినట్లు సమాచారం. అందుకే పోటీని నివారించి, సినిమాకు సోలో రిలీజ్ విండో, వేసవి సెలవుల ప్రయోజనం దక్కాలనే ఉద్దేశంతో ‘పెద్ది’ చిత్రాన్ని 2026 వేసవికి వాయిదా వేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం.