భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా, ఏకంగా వేసవి 2026కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది, సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం. భారీ బడ్జెట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చని భావిస్తున్నారు. Also Read…