Peddi VS Devara : ‘దేవర’ని అందుకోలేకపోయిన ‘పెద్ది’.. ఛాన్స్ మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ రన్ చివరి దశకు చేరుకుంది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే సినిమా లాంగ్ రన్ ముగింపునకు రావడంతో రూ. 500 కోట్ల క్లబ్‌ను అందుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు తేల్చేయడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
Also Read
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 135 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. లాంగ్ రన్లో మొత్తంగా రూ. 400 కోట్ల క్లబ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 450 కోట్ల మార్క్‌ను రీచ్ అయ్యే దిశగా దూసుకుపోతోంది. అయితే థియేట్రికల్ రన్ దాదాపు ముగింపునకు రావడంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన రూ. 500 కోట్ల మార్క్‌ను ‘పెద్ది’ అందుకోలేకపోవచ్చని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిజానికి ‘పెద్ది’ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య గట్టి పోటీ నడిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా సాధించిన రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా మెగా ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. మిక్స్డ్ టాక్‌తోనే ‘దేవర’ మూవీ రూ. 500 కోట్లకు పైగా రాబట్టింది, ‘పెద్ది’ అంతకంటే పెద్ద హిట్ అవుతుందని ఆశించారు. కానీ ప్రస్తుత బాక్సాఫీస్ నెంబర్స్ చూస్తుంటే రూ. 500 కోట్ల మార్క్ అందుకోవడం దాదాపు అసాధ్యమని మెగా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.
తాజావార్తలు
-
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
-
Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
-
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
-
Peddi VS Devara : ‘దేవర’ని అందుకోలేకపోయిన ‘పెద్ది’.. ఛాన్స్ మిస్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!