Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే పర్ఫెక్షన్. ప్రతీ షాట్ తాను అనుకున్న విధంగా వచ్చేంత వరకు ఆయన అస్సలు వదిలిపెట్టరు. తాజాగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో విల్లడించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచర్ చిత్రం “వారణాసి” షూటింగ్ విశేషాలను పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు
ఆ సీన్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “వారణాసిలో ఒక పర్టికులర్ షాట్ ఉంది. నేను, మహేశ్ తెల్లవారుజామునే షూటింగ్ ప్రారంభించాం. సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాం. కానీ ఆ రోజుకు ఆ షాట్ పూర్తి కాలేదు. దీంతో మరుసటి రోజు కూడా అదే షాట్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఆ ఒక్క షాట్ కోసమే మేము ఏకంగా 90 నుండి 97 కంటే ఎక్కువ టేకులు తీసుకున్నాం. రాజమౌళి ఇప్పటికి ఒక డెబ్యూ డైరెక్టర్స్ లాగా కష్టపడుతుండం చూసి ఆశ్ఛర్యం కలిగింది’ అని అన్నారు. ఈ చిత్రంలో మహేశ్ ‘రుద్ర’ పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో, ఆఫ్రికా నుండి అంటార్కిటికా వరకు అనేక యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది వారణాసి. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు అవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!