Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని, వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి తమ హీరోలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
‘పెద్ది’ సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘చరణ్‌కు అవార్డ్ వచ్చినా రాకపోయినా.. అది పెద్ద సమస్య కాదు. అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఇండైరెక్ట్‌గా బన్నీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారంటూ మెగాస్టార్‌ను నెట్టింట ట్రోల్ చేయడం ప్రారంభించారు. “ఇంతవరకు జాతీయ అవార్డులు అందుకున్నవారంతా పక్క దారుల్లో గెలుచుకున్నవారేనా?” అంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇదే ఈవెంట్లో చిరంజీవి నటనకు తనదైన శైలిలో డెఫినిషన్ ఇస్తూ ‘కేవలం ముఖ కవళికలతో నటిస్తే యాక్టింగ్ సంపూర్ణం కాదు. పాత్రలోకి పూర్తిగా లీనమైపోయి కళ్ళతో భావాలు పలికిస్తేనే నటన సంపూర్ణమవుతుంది“ అని చిరు అన్నారు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్స్ నటనతో ఆకట్టుకునే తారక్ సంపూర్ణ నటుడు కాదా? అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కామనే. కానీ, ‘పెద్ది’ ఘన విజయం సాధించి 20 రోజులు తర్వాత ఈ సక్సెస్ మీట్ వేదికగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్ బేస్‌ల మధ్య పెద్ద అగ్గి రాజేసిందని చెప్పాలి.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!