Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya Ram Shankar: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఆదిత్య రామ్ శంకర్‌పై ముంబైలో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జుహూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయమై సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత మహిళకు సుమారు ఏడాది క్రితం ఓ ఉమ్మడి స్నేహితుడి ద్వారా ఆదిత్య రామ్ శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారిందని, అనంతరం పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి జుహూలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని పదేపదే చెప్పి చాలాకాలంగా తనతో శారీరక సంబంధాలు కొనసాగించాడని మహిళ తెలిపింది. అయితే పెళ్లి విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేవాడని ఆరోపించింది.
Also Read
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్‌షిప్ ఫీజులు?
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
ఈ ఏడాది మే 25న మరోసారి పెళ్లి గురించి ఆదిత్యతో పాటు అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. తాను వేరే కులానికి చెందిన మహిళ కావడంతో వివాహం సాధ్యం కాదని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తనను మోసం చేసినట్లు గ్రహించానని, తప్పుడు పెళ్లి హామీలతో తనను శారీరకంగా వాడుకున్నాడని మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జుహూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ఆదిత్య రామ్ శంకర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆరోపణలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై ఆదిత్య రామ్ శంకర్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
-
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
-
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!