టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలకు సిద్ధం అవుతున్న..అందులో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అందులో గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఒకటి. బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ఉహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..
Also Read : Ameesha Patel : పెళ్లి కాకుండానే అమీషా తల్లి కాబోతుందా..?
ఎంటీ అంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. దీని గురించి ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. గతంలో కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ వార్త నిజమైతే, ఈ సారి కూడా కాజల్ హిట్ కొట్టడం ఖాయం. ఇక పోతే ఈ మూవీ 2026 మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయానికి నాని ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా ఫిక్స్ అయింది. ఇక ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే ఉండబోతున్నట్లు గా కనిపిస్తోంది.