పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక ఆసక్తికర లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vijay Deverakonda: హిందీలో కింగ్డమ్ పేరు మారింది.. ఏంటో తెలుసా?
రాశీ ఖన్నా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని మైత్రి মూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ స్తాద్ భగత్ సింగ్ సినిమాకి డేట్స్ కేటాయించారు. ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించడంతో సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తోంది సినిమా యూనిట్.