పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశారు వస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఒక రోజు ముందుగానే పోస్టర్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు.
Also Read : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది
అందులో భాగంగానే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఒక స్టిల్‌ను పోస్టర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ స్టిల్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ వెనుక ఒక పెద్ద క్లాక్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తలమీద హాట్ పెట్టుకొని, డాన్స్ స్టెప్ వేస్తూ కనిపిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మైత్రి మూవీ బ్యాగ్రౌండ్ మీద నిర్మిస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్ అంటూ, వెనుక గడియారం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే ఆకట్టుకునేలా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి.