Spirit : మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడంట. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ.. సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాక ముందు నుంచే భారీగా రూమర్లు వస్తున్నాయి. అందులో చిరంజీవికి సంబంధించిందే ట్రెండింగ్ లో ఉంది. సందీప్ రెడ్డి వంగా రీసెంట్ గా తన ఆఫీస్ లో చిరంజీవి ఓల్డ్ పిక్ పెట్టుకోవడం చూపించిన తర్వాతనే ఈ రూమర్ ఎక్కువ అయింది.
Read Also : RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
చిరంజీవిపై అమితమైన అభిమానం ఉన్న సందీప్.. ఆయన్ను తన స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు తండ్రిగా చూపించబోతున్నాడని.. ఇందుకోసం ఇప్పటికే చిరును ఒప్పించాడంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అవి నిజం కాదని తేలిపోయింది. ఈ రూమర్లపై తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఏదైనా అప్డేట్ ఉంటే కేవలం సందీప్ రెడ్డి వంగా నుంచి లేదంటే భద్రకాళి నుంచి మాత్రమే ప్రకటనలు వస్తాయని.. మిగతావి నమ్మొద్దు అంటూ చెప్పింది టీమ్. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ సందీప్ నేరుగా ప్రకటిస్తున్నాడు. ప్రభాస్, త్రిప్తి డిమ్రి, మూవీ స్టార్ట్ చేసే డేట్స్.. ఇలా అన్నీ సందీప్ వెల్లడిస్తున్నాడు. కాబట్టి చిరు నటించేది నిజమే అయితే స్వయంగా సందీప్ మాత్రమే చెప్తాడు కదా. అలా చెప్పట్లేదు అంటే ఇందులో నిజం లేదని తేలిపోతోంది.
Read Also : NTR-NEEL : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..