Site icon NTV Telugu

OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ

Og Pawan

Og Pawan

దసరా సెలవుల సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతోంది. ఈ సుదీర్ఘ సెలవుల కాలంలో పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం సోలో రిలీజ్‌గా రానుంది. గతంలో బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా ఈ పండుగ బరిలో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల డిసెంబర్ 5కు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద అడ్వాంటేజ్ లభించనుంది.

Also Read : Mahesh Babu vs Allu Arjun: ఇది హాలీవుడ్ వార్?.. మహేష్‌ బాబు vs అల్లు అర్జున్ మధ్య ఫైట్!

పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించనున్న ‘OG’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందని, ఇది పలు పాన్-ఇండియన్ చిత్రాలను మించిపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘OG’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ‘OG’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

Exit mobile version