Mahesh Babu vs Allu Arjun: ఈసారి టాలీవుడ్ వార్ హాలీవుడ్‌లోకి వెళ్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్‌లో నువ్వా? నేనా? అనేలా పోటీ పడుతున్నారు. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా? కావా? అనే విషయం పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలు కొన్ని విషయాల్లో గట్టిగా పోటీపడుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్, బన్నీ చేస్తున్న సినిమాలు ఇండియాస్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్‌తో రాబోతున్నాయి. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టుగా టాక్ ఉంది. అలాగే ఆస్కార్‌ను టార్గెట్ చేస్తు.. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఓ బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అంతేకాదు, కొందరు హాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో తీసుకుంటున్నాడు. ఇక అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాను దాదాపు 800 కోట్లతో నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఈ సినిమాను విజువల్ వండర్‌గా హాలీవుడ్ స్థాయిలో తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వీడియోతోనే చెప్పేశారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు పని చేస్తున్నారు. లేటెస్ట్‌గా హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ స్టూడియోని కో-ప్రొడ్యూస్ చేసుకోవడానికి సన్ పిక్చర్స్ చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే రాజమౌళి గ్లోబల్ మార్కెట్ టార్గెట్‌గా, మహేష్ బాబుని హాలీవుడ్‌లో సెటిల్ అయ్యే రేంజ్‌లో ప్లాన్ చేస్తుండగా.. ఇప్పుడు బన్నీ-అట్లీ కూడా ఆయన దారిలోనే వెళ్తున్నట్టుగా చెప్పొచ్చు. మరి టాలీవుడ్ నుంచి వస్తున్న ఈ హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి.