పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథ చెప్పిన తరువాత, పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి సల్మాన్ ఖాన్, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ప్రస్తుతానికి ఉండే అవకాశం అయితే లేదని అంటున్నారు.
Also Read :Nizamabad: మహిళల వరుస హత్యలు.. మొండెం లేని లేడీ మృతదేహం కలకలం..
ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు, సల్మాన్ ఖాన్ చేయరు అనుకున్న కథ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చినట్లు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి, వంశీ పైడిపల్లి అదే సినిమా పవన్ కళ్యాణ్‌తో చేయలేరు. కాబట్టి, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో వేరే సినిమా చేస్తారా, లేక పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు పూర్తి చేసిన అనంతరం వంశీ పైడిపల్లి ఆయనకు మరో కథ సిద్ధం చేస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.