పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథ చెప్పిన తరువాత, పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి సల్మాన్ ఖాన్, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.…
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి చేతులు కలపబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ, మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నిర్మాత దిల్ రాజు ఇటీవలే పవన్…