పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో పాటు ఇంతకుముందు ఓజి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు.
Also Read:Allu Aravind: ఫేక్ ఐడీతో ఈ హీరోయిన్ ను ఫాలో అవుతున్నా!
దానికి ముందు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక ఈ మూడు సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమిళ దర్శక, నటుడు సముద్రఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమా చేశారు.
Also Read:Allu Aravind: నాకు కథ చెప్పలేనని డైరెక్టర్ పారిపోయాడు!
తమిళంలో సూపర్ హిట్ గాని నిలిచిన వినోదయ సిత్తం సినిమాకి ఈ సినిమా రీమేక్. అయితే ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా నిర్మాత ఎవరు? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది> అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సముద్రఖనితో మరో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది.