పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ముంబాయి షెడ్యూల్ నిన్నటితో (జూన్ 3, 2025) విజయవంతంగా ముగిసింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోందని సమాచారం. Also Read: IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…