బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
Also Read:Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్రమాదం పై.. స్పందించిన నిఖిల్
ఇక ఈ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ ఎన్ఎమ్ నిహారిక గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈమె నాకు ముందే తెలుసు అని చెప్పుకొచ్చారు. బన్నీ వాసు ఈమెతో పాటు మరి కొంతమంది అమ్మాయిలు ఫోటోలు ఇచ్చి సెలెక్ట్ చేయమంటే నేను వెంటనే ఈమె ఫోటో సెలెక్ట్ చేశాను. ఈమె మీకు ముందే తెలుసా అని అడిగితే నేను మా ఫేక్ ఐడి తో ఆమెను ఫాలో అవుతానని ఆమె వీడియోస్ అన్నీ చూస్తానని చెప్పుకొచ్చారు.
Also Read:Mithra Mandali : నవ్వుల తుపాన్‌గా దూసుకొచ్చిన ‘మిత్ర మండలి’ టీజర్..!
అల్లు అరవింద్ ఈ విషయం చెబుతుంటే ఆమె నమ్మకపోవడంతో నిజమేనని నేను నిన్ను ఫాలో అవుతానని ఈ సందర్భంగా అల్లు అరవింద్ పేర్కొనడం గమనార్హం. ఇక పక్కన ఉన్నవారు అది ఫేక్ ఐడి కాదు మీ పర్సనల్ ఐడి అని చెప్పండి అంటే అందులో తప్పేమీ లేదని నా సొంత ఐడితో వచ్చి ఏం చేసినా బూతులతో రెచ్చిపోతారు కాబట్టి ఇలా వేరే అకౌంట్స్ తో అందరిని అబ్జర్వ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు..